Minister Satya kumar: బెదిరిస్తే భయపడేవారెవరూ లేరు
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:37 AM
విష సంస్కృతిని అలవర్చుకున్న వైసీపీ డిజిటల్ బుక్ పేరుతో బెదిరిస్తే భయపడేవారెవరూ లేరని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
అసెంబ్లీకి వచ్చే దమ్ములేని నాయకుడు జగన్: మంత్రి సత్యకుమార్
అనంతపురం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): విష సంస్కృతిని అలవర్చుకున్న వైసీపీ డిజిటల్ బుక్ పేరుతో బెదిరిస్తే భయపడేవారెవరూ లేరని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీకి వచ్చే దమ్ములేని నాయకుడు జగన్ అని, ప్యాలె్‌సలో కూర్చుని కలలు కనడమే ఆయన పని అని విమర్శించారు. ప్రజలపై దాడులు చేయడం, తలలు నరకడం.. తొక్కించడం.. రప్పరప్ప అనడం.. జగన్ వ్యక్తిత్వమని విమర్శించారు. వైసీపీ నాయకులు అధికారం కోల్పోవడంతో వారి మానసిక పరిస్థితి బాగోలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటున్న ఆ పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చేదీ లేదు.. సచ్చేదీ లేదు అని వ్యాఖ్యానించారు.