Nara Bhuvaneshwari: రాష్ట్రాభివృద్ధిని ఎవరూ ఆపలేరు
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:33 AM
ఇది సన్ రైజ్ ఏపీ. ఎవరెన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ ఆపలేరు అని సీఎం చంద్రబాబు సతీమణి...
కుప్పం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘ఇది సన్ రైజ్ ఏపీ. ఎవరెన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ ఆపలేరు’ అని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పర్యటనలో తొలి రోజైన బుధవారం ఆమె ద్రావిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ‘సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధిని ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. పోలవరం ప్రాజెక్టు 2027లో, అమరాతి సంపూర్ణ నిర్మాణం 2029లో పూర్తవుతుంది. గడిచిపోయిన ప్రభుత్వం గురించి మాట్లాడడం దండగ. అది మూసివేసిన పేజీ. విద్యార్థులు దేశం కోసం, రాష్ట్రం కోసం శ్రమించాలి’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. అనంతరం ఆమె ద్రావిడ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలోనే ‘అలీప్’ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రం గుడుపల్లె మండలం మల్లప్పకొండపై వెలసిన మల్లేశ్వరస్వామివారి ఆలయంలో జరిగిన దీపారాధనలో భువనేశ్వరి పాల్గొన్నారు. కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు.