CS Vijayanand: యూరియా కోసం ఆందోళన వద్దు
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:11 AM
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదు. అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.
రైతులకు వాస్తవాలు చెప్పండి.. కలెక్టర్లతో సీఎస్
ఇంటర్నెట్ డెస్క్: ‘రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదు. అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారం టూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించా లన్నారు. రైతులకు, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల్లో ఎరువుల రోజువారీ ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్‌ను డిస్‌ప్లే చేయాలన్నారు.