Share News

విద్యుత్‌ చార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:59 AM

భవిష్యత్తులో విద్యుత్‌ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని,ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

విద్యుత్‌ చార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి

బద్వేలు/టౌన్‌,జూలై 13(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో విద్యుత్‌ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని,ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ఆదివారం కడప జిల్లా బద్వేలులో ఆయన మీడియాతో మాట్లాడారు.జగన్‌ పాలనలో విద్యుత్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు.కడప జిల్లా పోరుమామిళ్ల పరిధిలోని 600 ఎకరాల్లో సోలార్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి బద్వేలు టీడీపీ ఇన్‌చార్జి రితేష్ రెడ్డి తీసుకొచ్చారు. మంత్రి స్పందిస్తూ..సోలార్‌ విద్యుత్‌ పరిశ్రమల ఏర్పాటుకు రాయలసీమ అనుకూల ప్రాంతమని,త్వరలో ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.అనంతరం జరిగిన విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశంలోనూ..విద్యుత్‌ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Jul 14 , 2025 | 04:00 AM