Minister T.G Bharath: పరిశ్రమలకు అనుమతుల్లో ఆలస్యం చేయొద్దు
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:16 AM
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ అన్నారు.
ప్రాజెక్టులు త్వరగా గ్రౌండింగ్
అయ్యేలా చూడాలి: మంత్రి భరత్
అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. పరిశ్రమలకు అనుమతుల విషయంలో ఆలస్యం ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేసేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మేనేజర్లతో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐపీబీ ఆమోదించిన పెట్టుబడుల పురోగతిపై ఆరా తీశారు. జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. భూములు తీసుకున్న కంపెనీలు పనులు మొదలు పెట్టకపోతే.. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడాలని, స్పందన లేకపోతే భూ కేటాయింపులు రద్దు చేయాలని చెప్పారు. రష్యాలో ఉపాధి కల్పనకు ఒప్పందాలుయువతకు రష్యాలో ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు కల్పించేందుకు ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం ప్రాథమిక ఒప్పందాలు చేసుకుంది. మంగళవారం విశాఖలో నిర్వహించిన కార్యక్రమానికి ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ జి.గణేశ్‌కుమార్, ఏయూ వీసీ రాజశేఖర్, ప్రభుత్వ సలహాదారు సీతా శర్మ హాజరయ్యారు. తమ దేశ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాల గురించి రష్యా అధికారి అనోవా వివరించారు. ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల వివరాలను శశిధర్ తెలిపారు.