SE Narayana Naik: తుంగభద్ర డ్యాంకు ప్రమాదం లేదు
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:53 AM
తుంగభద్ర డ్యాంకు ఎలాంటి ప్రమాదమూ లేదని బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. డ్యాంకు అమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నంబర్ల క్రస్ట్ గేట్లు దెబ్బతిన్నాయని డ్యాం సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో...
ఖరీఫ్‌కు నీటికి ఢోకాలేదు.. వర్షాలు పడితేనే రబీకి..
బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్
బళ్లారి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాంకు ఎలాంటి ప్రమాదమూ లేదని బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. డ్యాంకు అమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నంబర్ల క్రస్ట్ గేట్లు దెబ్బతిన్నాయని డ్యాం సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డితో కలిసి ఆయన శనివారం డ్యాంను పరిశీలించారు. సీడబ్ల్యూసీ, టీబీపీ బోర్డు, ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల సూచనల ప్రకారం డ్యాంలో 80 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నామని తెలిపారు.వరద పెరిగితే క్రస్ట్ గేట్లు తెరిచి 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని నదికి వదిలే అవకాశం ఉందని చెప్పారు.ఖరీఫ్‌లో పంట సాగుకు, తాగునీటికి ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు.ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఖరీఫ్‌కు మాత్రమే సాగు నీరిస్తామని,రబీకి నీరు ఉండదని స్పష్టం చేశారు.వర్షాలు కొనసాగి, డ్యాంలో నీరు నిల్వ ఉంటే రబీకి కూడా ఇస్తామని ఆయన తెలిపారు.ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ పరిధిలో వివిధ కాలువల కింద 17 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగయ్యాయని పేర్కొన్నారు.