Minister Satya kumar: రాష్ట్రంలో కల్తీ దగ్గు మందు లేదు
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:39 AM
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 12 మంది చిన్నారుల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందు కోల్ర్డిఫ్ జాడ రాష్ట్రంలో లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
దుకాణాలకు, ఆస్పత్రులకు సరఫరా కాలేదు ఆందోళన చెందవద్దు: మంత్రి సత్యకుమార్
అమరావతి/గుంటూరు వైద్యం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 12 మంది చిన్నారుల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందు కోల్ర్డిఫ్ జాడ రాష్ట్రంలో లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఔషధ దుకాణాలకు కానీ, ప్రభుత్వాసుపత్రులకు కానీ ఆ దగ్గు మందు సరఫరా చేయలేదని చెప్పారు. అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు, జలుబుకు సంబంధించి ద్రవరూపంలో మందులు సూచించకుండా వైద్యులకు ఆదేశాలు పంపాలని అధికారులకు స్ప ష్టం చేశారు. రాష్ట్రంలోని ఔషధ దుకాణాల్లో కోల్ర్డిఫ్ మందు ఎక్కడా లేదని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్, డ్రగ్స్ డీజీ గిరీషా మంత్రికి తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సోమవారం మం దుల దుకాణాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు జరిపారు.