Share News

Bodapadu MPP School: నో అడ్మిషన్స్‌.. బోడపాడు ఎంపీపీ పాఠశాల ఫుల్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:12 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున పిల్లల్ని చేర్చండి. పాఠశాలల వద్ద ‘నో అడ్మిషన్స్‌’ బోర్డులు కనిపించాలి’’... ఇదీ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఆశయం...

Bodapadu MPP School: నో అడ్మిషన్స్‌.. బోడపాడు ఎంపీపీ పాఠశాల ఫుల్‌

ఇంటర్నెట్ డెస్క్: ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున పిల్లల్ని చేర్చండి. పాఠశాలల వద్ద ‘నో అడ్మిషన్స్‌’ బోర్డులు కనిపించాలి’’... ఇదీ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఆశయం... ఆలోచన. దీనినే ఆచరణలో చూపించింది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాల. ఈ స్కూలులో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరారు. ఎంతగా అంటే.. పాఠశాల ముందు ‘నో అడ్మిషన్‌’ బోర్డు ఏర్పాటు చేసేంతగా!. ఇక్కడ గతంలో 72 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ ఏడాది కొత్తగా 64మంది చేరారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 136కు చేరింది. తమ గ్రామంలో 1-5 తరగతుల పిల్లలెవరూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లరని గ్రామస్థులు, ఉపాధ్యాయులు తెలిపారు. నో అడ్మిషన్‌ బోర్డు పెట్టడంతో సుమారు 100 మంది వెనక్కి వెళ్లిపోయారని హెచ్‌ఎం జాక్‌, ఉపాధ్యాయుడు శ్రీనివాసులు తెలిపారు.

- మార్కాపురం రూరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 23 , 2025 | 05:14 AM