Nimmala Ramanaidu: జగన్ నుంచే ప్రజలకు భద్రత కావాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:50 AM
జగన్ భద్రత కంటే ప్రజలు ఆయన నుంచే భద్రత కావాలని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. జగన్‌కు 1100 మంది పోలీసులతో కూడిన భద్రత ఉన్నా ఇంకా గద్దించినట్టు చెబుతుండటం విడ్డూరమని తెలిపారు

అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ‘నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలి? భద్రత కావాల్సింది జగన్‌కు కాదు. జగన్ నుంచి రాష్ట్రానికి.. ప్రజలకు భద్రత కావాలి’ అని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం సచివాయలంలో పైవిధంగా స్పందించారు. సీఎం చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నా నామమాత్రపు భద్రతతో పర్యటనలకు వెళ్తున్నారని, జగన్‌కు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించినా సరిపోలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ వచ్చిన హెలికాప్టర్ వద్దే 250 మంది పోలీసులు ఉన్నారని, అయినా భద్రత లేదనడం ఏమిటన్నారు.