Share News

Nimmagadda Ramesh Kumar: రెండోదశ భూసమీకరణపై చర్చ అవసరం

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:35 AM

రాజధాని అమరావతి నిర్మాణానికి రెండోదశ భూసమీకరణపై చర్చ జరగాల్సి అవసరం ఉందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ(సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ‘రాజ్యాంగం-జవాబుదారీతనం’ అంశంపై సీఎ్‌ఫడీ ఆధ్వర్యంలో విజయవాడలో

Nimmagadda Ramesh Kumar: రెండోదశ భూసమీకరణపై చర్చ అవసరం

  • ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు పెట్టిన కేసులుఎవరూ పట్టించు కోవట్లేదు: నిమ్మగడ్డ వ్యాఖ్యలు

విజయవాడ, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణానికి రెండోదశ భూసమీకరణపై చర్చ జరగాల్సి అవసరం ఉందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ(సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ‘రాజ్యాంగం-జవాబుదారీతనం’ అంశంపై సీఎ్‌ఫడీ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజధానిలో మరో 40 వేల ఎకరాలను సమీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. భూసమీకరణ అవసరమే కానీ, చేయాల్సిన సమయం ఇది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఈ విషయాల్లో సీఎ్‌ఫడీ తటస్థ వైఖరితో ఉంటోందని చెప్పారు. పౌరసమాజం చట్టబద్ధ, సుపరిపాలనను కోరుకుంటోందని నిమ్మగడ్డ తెలిపారు. ప్రజలకు అవినీతి లేని పాలనను అందించడంలో నేతల కంటే అధికారులకే ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. కానీ, ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం అధికారులు పనిచేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘా లు తమ సమస్యలపై మాత్రమే స్పందిస్తున్నాయన్నారు.

స్పందన ఏదీ?

తాను ఎన్నికల సంఘ కమిషనర్‌గా ఉన్న సమయంలో జరిగిన ఘటనపై నాటి అధికారులే కాకుండా, ప్రస్తుత అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని రమేశ్‌కుమార్‌ ఆరోపించారు. తాను పదవిలో ఉన్నప్పుడు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా, కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి తనపైన, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపైన దారుణమైన భాషను ప్రయోగించారని గుర్తు చేశారు. దీనిపై తాను కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని, డీజీపీ హరీ్‌షకుమార్‌గుప్తా గానీ దీనిపై ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.


  • బ్లాక్‌షీప్‌లా అనర్హత అంశం: జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

పార్టీలు ఫిరాయిస్తున్న చట్టసభ సభ్యులపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అనర్హత అంశం ఒక బ్లాక్‌షీ్‌పలా తయారైందన్నారు. తెలుగు రాష్ట్రా ల చట్టసభల్లో జరుగుతున్న పరిణామాలను స్వయంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు మరో పార్టీలోకి వెళ్తున్నారని, అలాంటి వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్లకు ఫిర్యాదు చేసినా వారు నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు.

Updated Date - Jul 28 , 2025 | 05:38 AM