Kovuru: పోలీసు కస్టడీలో ఆరుగురు కిలేడీ అనుచరులు
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:24 AM
నెల్లూరు కిలేడీ నిడిగుంట అరుణను విచారించిన పోలీసులు ఇప్పుడు ఆమె అనుచరుల నుంచి పూర్తి వివరాలు రాబట్టే పనిలో పడ్డారు.
కోవూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): నెల్లూరు కిలేడీ నిడిగుంట అరుణను విచారించిన పోలీసులు ఇప్పుడు ఆమె అనుచరుల నుంచి పూర్తి వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. కోవూరు మండలం పడుగుపాడులోని సాయి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంటులో ప్లాటును ఆక్రమించిన కేసులో అరుణ అనుచరులు పల్లం వేణు, అంకెం రాజ, షేక్ అప్సర్, షేక్ మునీర్, మచ్చకర్ల గణేశ్, ఎలీషాలను కోవూరు సీఐ సుధాకరరెడ్డి మంగళవారం విచారించారు. అపార్ట్‌మెంట్ యజమానిపై వీరంతా దౌర్జన్యానికి పాల్పడ్డారు. నెల్లూరు జైలులో ఉన్న వీరందరినీ పోలీసులు కస్టడీకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషనుకు తరలించి రోజంతా విచారించారు. అరుణతో కలిసి చేసిన నేరాల గురించి వారి నుంచి సీఐ వివరాలు రాబట్టినట్లు తెలిసింది.