National Investigation Agency: ఎన్‌ఐఏ కోర్టుకు ఉగ్ర కుట్ర నిందితుడు
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:40 AM
విజయనగరంలో ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర కేసులో మరో కీలక నిందితుడు ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలిబ్‌ను ఢిల్లీ విమానాశ్రయం లో ఆరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు బృందం...
విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర కేసులో మరో కీలక నిందితుడు ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలిబ్‌ను ఢిల్లీ విమానాశ్రయం లో ఆరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) విశాఖపట్నం కోర్టులో శుక్రవారం హాజరుపరిచింది. బిహార్‌కు చెందిన ఆరిఫ్ దేశం విడిచి పారిపోతుండగా అరెస్ట్ చేశారు. కోర్టు నిందితునికి సెప్టెంబరు 12వ తేదీ వరకు రిమాండ్ విధించగా విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సిరాజ్-ఉర్.రెహ్మాన్, సయ్యద్ సమీర్‌తో ఆరి్‌ఫకు సంబంధాలున్నట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర కార్యకలాపాలకు ఆయుధాల అక్రమ రవాణా చేయడంలో అతను పాల్గొన్నట్టు వెల్లడైంది.