Visakhapatnam Tourism: విశాఖకు మరో పర్యాటక హంగు
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:09 AM
విశాఖపట్నం పర్యాటక రంగానికి అదనపు ఆకర్షణ తోడైంది. ఎప్పటి నుంచో చెబుతున్న కారవాన్ వాహనం ఎట్టకేలకు నగరానికి చేరింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా...
అరకు టూర్‌కు కారవాన్.. త్వరలో ప్యాకేజీ ఖరారు
విశాఖపట్నం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పర్యాటక రంగానికి అదనపు ఆకర్షణ తోడైంది. ఎప్పటి నుంచో చెబుతున్న ‘కారవాన్’ వాహనం ఎట్టకేలకు నగరానికి చేరింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విజయవాడలో దీనిని ప్రారంభించగా, సోమవారం ఇక్కడికి వచ్చింది. కలెక్టర్ హరేంధిరప్రసాద్, జాయింట్ కలెక్టర్ అశోక్ ఈ వాహనాన్ని పరిశీలించారు. సోమవారమే విధుల్లో చేరిన పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ కల్యాణి కొత్త కారవాన్ విశేషాలను వారికి వివరించారు. విశాఖపట్నానికి చెందిన శివాజీ అనే వ్యాపారవేత్త రూ.1.4 కోట్లతో సమకూర్చుకున్న ఈ వాహనాన్ని.. ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకున్న తర్వాత విశాఖ నుంచి అరకులోయ, పాడేరు, లంబసింగి తదితర పర్యాటక ప్రాంతాలకు నడుపుతారు. త్వరలో టూర్ ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తారు.