నూతన క్రీడాపాలసీ క్రీడాకారులకు వరం
ABN , Publish Date - May 18 , 2025 | 01:25 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నూత న క్రీడా పాలసీ వర్ఢమాన క్రీడాకారులకు ఒక వరమని ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ అన్నారు.
విజయవాడ స్పోర్ట్స్, మే 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నూత న క్రీడా పాలసీ వర్ఢమాన క్రీడాకారులకు ఒక వరమని ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ అన్నారు. ఆంఽద్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడ క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కార్యదర్శి శ్రీకాంత్ మట్లాడుతూ నూతన అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నికైందని, ఈ అసోసియేష న్ ఎకేఎ్‌ఫఐ గైడ్ లైన్స్ అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన విధంగా కబడ్డీ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని, కూటమి ప్రభు త్వంలో క్రీడల్లో రాజకీయాలు ఉండవని అన్నారు. తమ అసోసియేషన్‌కు ఎకేఎ్‌ఫఐ గుర్తింపు, సహకారం అందిస్తుందని, రాష్ట్రంలో నిబంధనల ప్రకా రం మా అసోసియేషన్‌కి మాత్రమే గుర్తింపు, అర్హత ఉన్నాయన్నారు. ప్ర తిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిం చి జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రాణించేలా చేస్తామని, ఖేలో ఇండియాలో మెడల్ కొట్టిన ప్రతి క్రీడాకారుడికి 5 వేలు బహుమతి అందిచ డం జరిగిందని తెలిపారు. గతంలో కొంతమంది కబడ్డీ క్రీడా అసోసియేషన్ పేరుతో వివాదాలు చేశారని, ఇ కపై అటువంటి వాటికి ఈ ప్రభుత్వంలో చోటులేదని, త్వరలోనే బీచ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కబడ్డీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు మ ణికంఠకు రూ.3 లక్షల చెక్‌ను అందజేశారు. కార్యవర్గం ఏన్నికకు ఎకేఎ్‌ఫ ఐ అబ్జర్వర్‌గా వీరేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించా రు. అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, వైస్ ప్రెసిడెంట్‌గా కృష్ణ, కార్యదర్శిగా యలమంచిలి శ్రీకాంత్‌లు ఎన్నికకగా, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించారు.