Pilgrim Accommodation: వసతి కష్టాలకు చెక్..
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:12 AM
ప్రస్తుతం తిరుమలలో ఉన్న గదులు, లాకర్లతో కూడిన యాత్రికుల వసతి సముదాయాల ద్వారా 45 వేలనుంచి 50 వేల మందికి మాత్రమే టీటీడీ వసతి కల్పించగలదు.
పీఏసీ5లో 4వేల మందికి బస
ప్రస్తుతం తిరుమలలో ఉన్న గదులు, లాకర్లతో కూడిన యాత్రికుల వసతి సముదాయాల ద్వారా 45 వేలనుంచి 50 వేల మందికి మాత్రమే టీటీడీ వసతి కల్పించగలదు. నిత్యం...తిరుమలకు చేరుకునేవారి సంఖ్య దాదాపు లక్షకుపైగా ఉంటోంది. ఈక్రమంలో యాత్రికుల వసతి కష్టాలను తగ్గించేందుకు రూ.102 కోట్లతో లాకర్లతో కూడిన వేంకటాద్రి యాత్రికుల వసతి సముదాయం-5 (పీఏసీ-5)ను నిర్మించింది. ఇందులో 4వేలమందికి వసతి కల్పించవచ్చు. 2,400 లాకర్లతోపాటు మరుగుదొడ్లు, 16 డార్మిటరీలు, స్నానపు గదులు, ఒకేసారి 80మంది తలనీలాలు సమర్పించేలా కల్యాణకట్ట, 1,400మంది అన్నప్రసాదాలు స్వీకరించేలా రెండు డైనింగ్ హాళ్లతో ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ (పీఏసీ)ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.