Share News

Nitin Gadkari: ఏపీకి కొత్త జాతీయ రహదారి

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:52 AM

ఉత్తరాంధ్రలో కీలకమైన గ్రీన్‌ఫీల్డ్‌ కోస్టల్‌ నేషనల్‌ హైవేకు లైన్‌ క్లియర్‌ అయింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు కోస్టల్‌ హైవే కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన...

 Nitin Gadkari: ఏపీకి కొత్త జాతీయ రహదారి

  • ఉత్తరాంధ్రలో గ్రీన్‌ఫీల్డ్‌ కోస్టల్‌ హైవేకు కేంద్రం ఓకే

  • శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు

  • 200 కిలోమీటర్ల రహదారితో మూడు జిల్లాలకు మహర్దశ

శ్రీకాకుళం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో కీలకమైన గ్రీన్‌ఫీల్డ్‌ కోస్టల్‌ నేషనల్‌ హైవేకు లైన్‌ క్లియర్‌ అయింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు కోస్టల్‌ హైవే కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభ్యర్థనకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఓకే చెప్పారు. ఈ హైవే మూలపేట పోర్టుకు అనుసంధానంగా ఉంటుందని చెబుతున్నారు. విశాఖ నుంచి భీమిలి వరకు జాతీయ రహదారి ఉంది. భోగాపురం వద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోంది. అటు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు ఆరు లేన్ల రహదారి అవసరం ఉందని గుర్తించారు. అందుకే భోగాపురం ఎయిర్‌పోర్టుకు, మూలపేట పోర్టుకు కనెక్టివిటీని పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. కొత్త హైవే అందుబాటులోకి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు మహర్దశ పట్టనుంది. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దీనిపై దృష్టి పెట్టారు. 200 కిమీ ఈ హైవేకు సంబంధించి ఆదేశాలొస్తే డీపీఆర్‌ సిద్ధం చేయనున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 08:56 AM