Share News

New Maternal and Child Hospital Blocks Soon: గుంటూరు, కాకినాడలో మాతా, శిశు ఆస్పత్రులు

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:22 AM

గుంటూరు, కాకినాడ సర్వజన ఆస్పత్రుల్లో పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో నూతనంగా రెండు ఎంసీహెచ్‌..

New Maternal and Child Hospital Blocks Soon: గుంటూరు, కాకినాడలో మాతా, శిశు ఆస్పత్రులు

అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గుంటూరు, కాకినాడ సర్వజన ఆస్పత్రుల్లో పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో నూతనంగా రెండు ఎంసీహెచ్‌ (మెటర్నల్‌, చైల్డ్‌ హాస్పిటల్‌) బ్లాకులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. వీటిలో అవసరమయ్యే రూ.51.33 కోట్ల విలువైన వైద్య పరికరాలను, ఇతర వస్తువుల కొనుగోలుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ రెండు ఆస్పత్రుల నిర్మాణానికి మందుకొచ్చిన గుంటూరు మెడికల్‌ కాలేజీ, కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీ పూర్త విద్యార్థులకు మంత్రి అభినందించారు. కాగా, సోమవారం (సెప్టెంబరు 8) ప్రపంచ ఫిజియోథెరఫీ దినం సందర్భంగా ఫిజియో థెరపిస్టులకు కూటమి ప్రభుత్వం తరఫున మంత్రి సత్యకుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ‘‘వృద్ధాప్యం-ఆరోగ్యం’’ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

Updated Date - Sep 08 , 2025 | 04:22 AM