Share News

Health Department: కొత్త డీహెచ్‌ఎస్‌ ఎవరో

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:50 AM

డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌(డీహెచ్‌ఎస్‌) నియామకంపై ఆరోగ్యశాఖ పునరాలోచనలో పడింది. ఆర్యోశాఖలో డీహెచ్‌ పోస్టు చాలా కీలకం. ఇలాంటి విభాగానికి డైరెక్టర్‌గా ఎవరిని నియమించాలనేదానిపై ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మంత్రి తీవ్రంగా శోధించారు.

Health Department: కొత్త డీహెచ్‌ఎస్‌ ఎవరో

  • కొనసాగలేనంటున్న డాక్టర్‌ పద్మాశశిధర్‌

  • ఇన్‌చార్జి డీహెచ్‌ఎస్‌గా డాక్టర్‌ పద్మావతి

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌(డీహెచ్‌ఎస్‌) నియామకంపై ఆరోగ్యశాఖ పునరాలోచనలో పడింది. ఆర్యోశాఖలో డీహెచ్‌ పోస్టు చాలా కీలకం. ఇలాంటి విభాగానికి డైరెక్టర్‌గా ఎవరిని నియమించాలనేదానిపై ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మంత్రి తీవ్రంగా శోధించారు. అడిషనల్‌ డైరెక్టర్లల్లో సీనియర్‌, రాజమండ్రి ఆర్డీగా పనిచేస్తున్న డాక్టర్‌ పద్మాశశిధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, ఆరోగ్య, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తాను ఆ పోస్టులో పని చేయలేనని ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎ్‌సను కలిసి వివరించారు. పైగా ఆమె కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ బంధువు కావడం కొంత ఇబ్బంది అయింది. చివరికి ఆమె తాను డీహెచ్‌గా విధులు నిర్వహించలేనని చెప్పడంతో నెక్ట్స్‌ ఎవరిని నియమించాలనే ఆలోచనలో ఆరోగ్యశాఖ పడింది. అంతవరకు ప్రస్తుతం ఇన్‌చార్జి డీహెచ్‌ఎ్‌సగా ఉన్న డాక్టర్‌ పద్మావతినే కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు. ఆమె ఏపీశాక్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ పోస్టుతో పాటు ఇన్‌చార్జి డీహెచ్‌ఎ్‌సగా కొనసాగనున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 02:54 AM