CM Chandrababu: అమరావతి నిర్మాణాలకు కొత్త జోష్
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:42 AM
రాజధాని అమరావతి నిర్మాణాలకు కొత్త ఊపు తీసుకొచ్చేలా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ అండ్ డెవల్‌పమెంట్...
7,500 కోట్ల రుణం మంజూరు చేసిన ఎన్‌ఏబీఎఫైఐడీ
తుళ్లూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణాలకు కొత్త ఊపు తీసుకొచ్చేలా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ అండ్ డెవల్‌పమెంట్ (ఎన్‌ఏబీఎఫైఐడీ) రూ.7,500 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అమరావతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రుణ మంజూరు పత్రాలను బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శామ్యూల్ జోసెఫ్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కే.దినేశ్‌లు.. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు అందజేశారు. కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా పాల్గొన్నారు. ప్రజారాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ రుణం ఉపయోగపడుతుందని కన్నబాబు తెలిపారు.