Blood Transfusion: కొత్తగా రక్తమార్పిడి మండలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:18 AM
ఆరోగ్యశాఖ మంత్రి నేతృత్వంలో కొత్తగా రక్తమార్పిడి మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆరోగ్యశాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటు
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖ మంత్రి నేతృత్వంలో కొత్తగా రక్తమార్పిడి మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నింగ్ బాడీలో ఆరోగ్యశాఖ మంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్, ఆర్థిక శాఖ సెక్రటరీ, ఆరోగ్య శాఖ కమిషనర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవోతో పాటు మరో తొమ్మిది మందిని సభ్యులుగా నియమించారు. ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. అలాగే రక్తమార్పిడి మండలికి ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా నియమించారు.