Minister Kollu Ravindra: పర్యాటకాభివృద్ధికి అనుకూలంగా బార్ పాలసీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:50 AM
నూతన బార్ పాలసీ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఉండాలని ఎక్సైజ్‌పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.
క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రుల అభిప్రాయాలు
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): నూతన బార్ పాలసీ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఉండాలని ఎక్సైజ్‌పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. పర్యాటక శాఖ సమన్వయంతో పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించింది. కమిటీ సమావేశం శుక్రవారం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ ప్రత్యక్షంగా, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు, 50 స్టార్ హోటళ్లలో బార్లు, మైక్రో బ్రూవరీలు ఉన్నాయని అధికారులు వివరించారు. రాష్ట్ర వైన్ డీలర్ల సంఘం వినతులను అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.