Internal Conflict: నెల్లూరు టీడీపీ నేతలపై పల్లా ఆగ్రహం
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:42 AM
నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు నేతలు తమ మధ్య ఉన్న విభేదాలతో పరస్పరం ఒకరిపై ఒకరు విలేకరుల సమావేశాలు పెట్టుకుంటూ రోడ్డున పడుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పల్లా రంగంలోకి దిగారు. నేతలిద్దరికీ ఫోన్ చేశారు. ‘పార్టీ క్రమశిక్షణను కాపాడటం ప్రతి కార్యకర్త, నాయకుడి ప్రాథమిక బాధ్యత. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు. నేతలిద్దరూ తమ వ్యవహార శైలి మార్చుకోవాలి’ అని పల్లా సూచించారు.