Nellore Mayor Politics: తిరుపతికి చేరిన నెల్లూరు మేయర్ రాజకీయం
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:12 AM
నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పోట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ పట్టు బిగించింది.
వైసీపీ ఎత్తుగడకు టీడీపీ బ్రేక్.. ఇద్దరు కార్పొరేటర్లు దేశం గూటికి
నెల్లూరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పోట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ పట్టు బిగించింది. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి తీరాలన్న నిర్ణయంతో మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కృషిచేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ పక్షాన 37 మంది కార్పొరేటర్లు క్యాంపులో ఉన్నారు. వీరంతా తిరుపతిలోని ఓ స్టార్ హోటల్‌లో బస చేసినట్లు సమాచారం. వీరితోపాటు మరో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గురువారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లలో ఇద్దరు అరగంట వ్యవధిలోనే స్పందిస్తూ.. తాము టీడీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. మ్యాజిక్ ఫిగర్(38) కన్నా రెండు ఓట్లు అధికంగా ఉండటంతో టీడీపీకి అనుకూలంగా అవిశ్వాసం నెగ్గే అవకాశాలు మెరుగుపడ్డాయి.