Share News

అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:53 PM

వ్యవసాయాఽధికారులు చేసిన ఈ-పంట నమోదు నిర్లక్ష్యం కారణంగా మండల కేంద్రమైన పోరుమామిళ్ల రైతులు తీవ్ర ఇక్కట్లుపడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
పోరుమామిళ్లలో మూతపడిన నాలుగో రైతు సేవాకేంద్రం

ఈ-పంట నమోదులో తక్కువ విస్తీర్ణం చూపిన వైనం సంచర్లలో కలిపిన పోరుమామిళ్ల రైతు సేవాకేంద్రాలు ఆందోళనలో అన్నదాతలు

పోరుమామిళ్ల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాఽధికారులు చేసిన ఈ-పంట నమోదు నిర్లక్ష్యం కారణంగా మండల కేంద్రమైన పోరుమామిళ్ల రైతులు తీవ్ర ఇక్కట్లుపడుతున్నారు. దీంతో మండలకేంద్రాల్లోనే పెద్ద మండ లంగా పేరున్న పోరుమామిళ్లలోని నాలుగు రైతు సేవాకేంద్రాలను సంచర్ల పంచాయతీలో ఉన్న రైతు సేవాకేంద్రంలో కలిపేశారు. ఇక నుంచి రైతులు వ్యవసాయ అవసరాల పనుల కోసం సంచర్లలోని రైతు సేవాకేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్లాల్సి వస్తోంది. ఒక రైతు సేవాకేంద్రం పరిధిలో వెయ్యి ఎకరాలు నమోదు ఉండాలనే ప్రభుత్వ ఆదే శాల మేరకు వ్యవసాయ ఆధికారులు ఈ-పంట నమోదు తక్కువ చేశారు. ఇందులో పోరుమామిళ్ల 1వ రైతు సేవాకేంద్రంలో 72 ఎకరాలు రెండో రైతు సేవాకేంద్రంలో 87 ఎకరాలు, 3,4 రైతుసేవా కేంద్రాల్లో ఎలాంటి పంటలు ఖలేకపోవడంతో ప్రభుత్వం సంచర్లలో కలిపింది. ఎరువులు, విత్తనాలు తది తరాలు కావాలన్నా రైతులు వ్యయప్రయాసాలకోర్చాల్సిన పరిస్థితి ఎదురైంది. పోరుమామిళ్ల చెరువు ఆయకట్టు దాదాపు అధికారికంగా 4600 ఎకరాలు అనధికారికంగా దాదాపు 10వేల వరకు ఉండవచ్చని అంచనా. ఈ చెరువు కింద ఎంత ఆయకట్టు ఉన్నా ఈ-పంట నమోదు తక్కువ కారణంగా పోరు మామిళ రైతులందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. పోరుమామిళ్ల వ్యవసాయ డివిజను పరిధిలో పోరుమామిళ్ల, బికోడూరు, కలసపాడు, కాశి నాయన, బి.మఠం మండలాలు వస్తాయి. ఈ డివిజను మొత్తం కలిపి 65 రైతు సేవాకేంద్రాలుంటే ప్రస్తుతం ఈ-పంట నమోదు కారణంగా 44 మాత్ర మే ఉండిపోయాయి. మండల కేంద్రంలోనే రైతు సేవాకేంద్రాలను తర లించడం దారుణమని రైతుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యమంటున్న కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని యథాతదంగా కొనసాగించాలని కోరుతున్నారు. అంతేకాక పుల్లీడు, రజాసాహబ్‌పేటలో కలపడం వల్ల ఆ ప్రాంత రైతులకు కూడా రైతు సేవాకేంద్రం దూరంగా ఉంటోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోరుమామిళ్లలోనే రైతు సేవా కేంద్రాలు కొనసాగించాలి

పోరుమామిళ్లలోనే రైతు సేవాకేంద్రాలలను కొనసాగించాలని పోరుమామిళ్ల మేజరు పంచాయతీరాజ్‌ సర్పంచ యనమల సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. నాలుగు మండలాల్లోకల్లా అతి పెద్ద మండలమైన పోరుమామిళ్ల మేజరు పంచాయతీ అని, గతంలో ఇక్కడ పంచాయతీ అన్నారు. అలాంటి చోట రైతు సేవాకేంద్రాలను దూరంగా సంచర్లలో కలిపి రైతులను ఇబ్బందిపెట్టడం సమంజసం కాదన్నారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఏడీఏ ఏమన్నారంటే: ఈ విషయమై వ్యవసాయ సహాయ సంచాలకుడు మురళీధర్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా 2024-25 సంవత్సరానికి సం బంధించి ఈ-పంట నమోదును పరిగణనలోకి తీసుకుని కనీసం వెయ్యి ఎకరాలు ఈ-పంట నమోదైన రైతు సేవాకేంద్రాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తక్కువగా నమోదైన రైతు సేవాకేంద్రాల్లోని ప్రాంతాలను, సమీపంలో ఉన్న ప్రాంతాలకు కలిపారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:53 PM