NEET UG 2025: నీట్‌లో ఆరు ర్యాంకులు మనకు
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:46 AM
నీట్ యూజీలో ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. టాప్ వంద ర్యాంకుల్లో ఏపీకి చెందిన ఆరుగురు ర్యాంకులు సాధించారు. గత నెల 4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశ వ్యాప్తంగా ఒకేసారి నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించి...
ఏపీ నుంచి 57,934 మంది హాజరు
36,776 మంది విద్యార్థుల అర్హత
19వ ర్యాంక్ సాధించిన డి.కార్తీక్‌రామ్ కిరీటి
కె.మోహిత్‌శ్రీరామ్ 56.. డి.సూర్యచరణ్‌కు 59వ ర్యాంక్
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నీట్ యూజీలో ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. టాప్ వంద ర్యాంకుల్లో ఏపీకి చెందిన ఆరుగురు ర్యాంకులు సాధించారు. గత నెల 4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశ వ్యాప్తంగా ఒకేసారి నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించి, ఫలితాలను శనివారం ఒకేసారి విడుదల చేసింది. జాతీయ స్థాయిలో ఏపీకి చెందిన డి.కార్తీక్‌రామ్ కిరీటి 19వ ర్యాంక్ సాధించారు. కె.మోహిత్‌శ్రీరామ్ 56వ ర్యాంక్, డి.సూర్యచరణ్ 59వ ర్యాంక్, పి.అవినాశ్ 64వ ర్యాంక్, వై.సమీర్‌కుమార్ 76వ ర్యాంక్, టి.శివమణిదీప్ 92వ ర్యాంక్ సాధించారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 59,219 మంది నీట్ రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 57,934 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. శనివారం విడుదలైన ఫలితాల్లో 36,776 మంది ర్యాంకులు సాధించారు. గత ఏడాది ఏపీ నుంచి 66,522 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 64,929 మంది హాజరయ్యారు. అందులో 43,788 మంది అర్హత సాధించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రిజిస్ట్రేషన్ తక్కువ మంది చేసుకున్నారు. అర్హత కూడా తక్కువ మంది సాధించారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే జాతీయ స్థాయిలో ఎయిమ్స్, ఇతర మెడికల్ సంస్థలు, రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు.