Neelayapalem Vijay Kumar: పరకామణి దొంగలకు తాడేపల్లి దొంగల వత్తాసు
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:34 AM
మాజీ సీఎం జగన్ బెంగళూరు నుంచి వచ్చి 3 గంటలపాటు పెట్టిన ప్రెస్‌మీట్‌లో హిందూ భక్తులను...
జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలి: నీలాయపాలెం
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ బెంగళూరు నుంచి వచ్చి 3 గంటలపాటు పెట్టిన ప్రెస్‌మీట్‌లో హిందూ భక్తులను, వారి మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరకామణి దొంగలకు తాడేపల్లి దొంగలు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.