మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:53 PM
జిల్లాలోని సచివాల యాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలం దించి పురోగతి సాధించాలని కలెక్టర్ రాజ కుమారి అధికారులను ఆదేశించారు.
· వీడియో కాన్ఫరెన్సలో కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని సచివాల యాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలం దించి పురోగతి సాధించాలని కలెక్టర్ రాజ కుమారి అధికారులను ఆదేశించారు. సోమ వారం ఆమె క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఈవో ఆర్డీలతో గ్రామ సచివాలయ సర్వీసులు, స్వామిత్వ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ.. సిటిజన ఈ-కేవైసీ విషయంలో నంద్యాల (అర్బన), పా ములపాడు, పడిడ్యాల, కొత్తపల్లి, బండిఆత్మకూరు, కొలిమిగుండ్ల, సిరి వెళ్ల, చాగలమర్రి, బనగానపల్లి (రూరల్), ఆత్మకూరు మండలాల్లో పురోగతి తగ్గిందని, ఈ నెల 12లోపు పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. చిల్డ్రన వితౌట్ ఆధార్ నమోదులో పెండింగ్‌లో ఉన్న మండలాలు మహిళా కార్యదర్శులతో సమన్వయం చేసి త్వరగా పూ ర్తి చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది హాజరు శాతాన్ని మెరుగుపరిచాలని, రీవెరిఫికేషన ఆఫ్ జియో కో ఆర్డినేట్స్‌లో పెండిం గ్‌లో ఉన్న 971 పూర్తి చేయాలన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి పై ప్రజలకు వెంటనే అవగాహన కలిగించాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌డీవో శివారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి పాల్గొన్నారు.
పోలియో వ్యాధిని నిర్మూలించాలి
జిల్లాలోని 0 నుంచి 5 ఏళ్ల పిల్లలందరికీ తప్పకుండా 2 చుక్కల పోలియో వ్యాక్సిన వేసి వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌ని పీజీఆర్‌ఎస్ హాల్‌లో డిసెంబరు 21న జరిగే పో లియో కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్నీ లైన డిపార్టుమెంట్లు సమన్వ యంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనం తరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వెంకటరమణ మాట్లాడు తూ.. జిల్లాలో 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు 2,38,404 మంది ఉన్నా రని, 1318 బూతులు ఏర్పాటు చేశామన్నారు. 5272 మంది సిబ్బంది డడిసెంబరు 21న పోలియో చుక్కలు వేస్తారన్నారు. మిగిలిన వారికి 22,23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన అధికారి డా.సుదర్శన బాబు , డీసీహెచఎస్ డా.లలిత, ప్రోగ్రామ్ అధికారులు డా. ప్రసన్నలక్ష్మీ, డా. శ్రీజ, డా. శ్రీనివాసులు పాల్గొన్నారు.