MP Lavu Srikrishna Devarayalu: ఏపీలో ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:29 AM
కాకినాడ, విశాఖపట్నంలో ఇప్పటికే ప్రతిపాదించిన 50 పడకల ఆసుపత్రులకు అదనంగా రాయలసీమ, పల్నాడు, ఒంగో లు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మరిన్ని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను....
లోక్‌సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు
న్యూఢిల్లీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కాకినాడ, విశాఖపట్నంలో ఇప్పటికే ప్రతిపాదించిన 50 పడకల ఆసుపత్రులకు అదనంగా రాయలసీమ, పల్నాడు, ఒంగో లు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మరిన్ని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం లోక్ సభలో ప్రస్తావించారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఆరోగ్య మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అదనపు ఆయుష్ ప్రాజెక్టులపై పరిశీలిస్తున్నామని ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు జవాబిచ్చారు.