Share News

NDMA Team: విపత్తుల సన్నద్ధతపై జాతీయ బృందం పరిశీలన

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:54 AM

విపత్తు నిర్వహణ సన్నద్ధతపై పరిశీలనకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) జాయింట్‌ అడ్వైసర్‌ నావల్‌ ప్రకాశ్‌, అండర్‌ సెక్రటరీ అభిషేక్‌ బిస్వాస్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ అభినవ్‌ వాలియ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

NDMA Team: విపత్తుల సన్నద్ధతపై జాతీయ బృందం పరిశీలన

అమరావతి, తాడేపల్లి (కుంచనపల్లి), జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): విపత్తు నిర్వహణ సన్నద్ధతపై పరిశీలనకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) జాయింట్‌ అడ్వైసర్‌ నావల్‌ ప్రకాశ్‌, అండర్‌ సెక్రటరీ అభిషేక్‌ బిస్వాస్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ అభినవ్‌ వాలియ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లాలో పర్యటించిన ఈ బృందం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని పరిశీలించింది. విపత్తుల సంస్థ అమలు చేసే ప్రణాళికలు, రుతుపవన సన్నద్ధత, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ, సమాచార పరికరాల పనితీరును స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ఈడీ వెంకట దీపక్‌ ఈ బృందానికి వివరించారు. మంగళవారం తూర్పుగోదావరి, అనకాపల్లి, బుధవారం విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నట్లు బృందం తెలిపింది.

Updated Date - Jun 24 , 2025 | 03:54 AM