Strong Unity and Smooth Governance: టీం ఎన్‌డీఏగా..
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:12 AM
చిన్నపాటి పొరపొచ్చాలు కూడా లేకుండా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రాభివృద్ధే ..
చిన్నపాటి పొరపొచ్చాలు కూడా లేకుండా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీట్లు సర్దుబాటు చేసుకున్న మూడు పార్టీలు.. అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాలో వెళ్తున్నాయి. కలిసికట్టుగా నడుస్తున్నాయి. 15 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ అగ్రనేతలు అత్యంత సమన్వయంతో పనిచేస్తున్నారు.నామినేటెడ్ పదవుల విషయంలోనూ మూడు పార్టీల మధ్య అంతే సమన్వయం, సహకారం కనిపిస్తున్నాయి. ప్రాంతాలు, జిల్లాల వారీగా ఆయా సామాజిక వర్గాల సమీకరణలను బేరీజు వేసుకుని పదవుల కూర్పు చేపడుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇప్పటి వరకు సుమారు 60 వేల నామినేటెడ్ పదవుల భర్తీ సాఫీగా జరిగింది. ‘కలిసి వచ్చాం.. కలిసి గెలిచాం.. భవిష్యత్‌లోనూ కలిసే ఉంటాం’ అనే బలమైన సంకేతాన్ని అనంతపురం వేదికగా పంపాలన్నది కూటమి నేతల లక్ష్యంగా కనిపిస్తోంది.