ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:28 PM
నవోదయ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష (2026-27) శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మిగనూరు మండలంలోని నవోదయ విద్యాలయంతో పాటు ఎమ్మిగనూరు పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎమ్మిగనూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నవోదయ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష (2026-27) శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మిగనూరు మండలంలోని నవోదయ విద్యాలయంతో పాటు ఎమ్మిగనూరు పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,292 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా కొంతమంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. కాగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 24 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. మొత్తంగా 6,469 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 4,548 మంది హాజరైనట్లు తెలిపారు.