Bapatla District: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:12 AM
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం...
బాపట్ల జిల్లాలో జాతీయ యోగాసనాల పోటీలు ప్రారంభం
బాపట్ల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లెళ్లమూడి గ్రామంలోని అమ్మవారి దేవస్థానంలో శనివారం 44వ జాతీయ యోగాసనాల చాంపియన్‌షిప్ పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన యోగా భారతీయుల సొత్తు కావడం గర్వకారణమన్నారు. గడిచిన 16 సంవత్సరాలుగా యోగాసనాలు వేయడమే తన ఆరోగ్య రహస్యమని కలెక్టర్ చెప్పారు. ఈ జాతీయ స్థాయి పోటీలకు 16 రాష్ట్రాల నుంచి 617 మంది పాల్గొన్నారు.