Science Festival: ఫిబ్రవరి 5 నుంచి విజ్ఞాన్ మహోత్సవం
ABN , Publish Date - Dec 31 , 2025 | 06:03 AM
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు జాతీయస్థాయిలో...
పోస్టర్స్ ఆవిష్కరించిన సినీ దర్శకుడు అనిల్ రావిపూడి
గుంటూరు (విద్య), డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు జాతీయస్థాయిలో విజ్ఞాన్ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు వీసీ ఆచార్య పి.నాగభూషణ్ వెల్లడించారు. ఈ మేరకు సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు యూనివర్సిటీలో మంగళవారం పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. విజ్ఞాన్స్ కాలేజీలో నిర్వహించిన మహోత్సవ్‌లో ‘చలో తిరుపతి’ స్కిట్‌తో తన సినీ ప్రయాణం ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. విజ్ఞాన్ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 50 వేల మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నాగభూషణ్ తెలిపారు. విజేతలకు రూ.15 లక్షలకు పైగా నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. మొత్తం 80కు పైగా ఈవెంట్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ర్టార్ డాక్టర్ పీఎంవీ రావు తదితరులు పాల్గొన్నారు.