Green skilling Drive: నేడు విజయవాడలో స్కిల్లింగ్ డ్రైవ్
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:33 AM
గ్రీన్ వర్క్‌ఫోర్స్‌కు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): గ్రీన్ వర్క్‌ఫోర్స్‌కు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. యువతకు పునరుత్పాదక ఇంధన రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చి పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈనేపథ్యంలోనే విజయవాడలో బుధవారం జాతీయ స్థాయిలో అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ జరగనుంది. ఈ డ్రైవ్‌లో దాదాపు 250 సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు.