Share News

Navataram Party President: ఇల్లు, కారు, ఆఫీసుపై.. రజినీ దాడి చేయించారు

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:58 AM

వైసీపీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ బుక్‌ యాప్‌ ద్వారా మాజీ మంత్రి విడదల రజినీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు...

Navataram Party President: ఇల్లు, కారు, ఆఫీసుపై.. రజినీ దాడి చేయించారు

  • వైసీపీ మాజీ మంత్రి విడదలపై ‘డిజిటల్‌ బుక్‌ యాప్‌’లో ఫిర్యాదు

చిలకలూరిపేట, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ బుక్‌ యాప్‌ ద్వారా మాజీ మంత్రి విడదల రజినీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యా దు చేశారు. 2022లో చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం సహా తన ఇల్లు, కారుపై రజిని దాడి చేయించారని తెలిపారు. ఆమెపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ‘డిజిటల్‌ బుక్‌’ ద్వారా జగన్‌కు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంపారు. డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు నమోదు అయినట్టు వచ్చిన టికెట్‌ను సుబ్రహ్మ ణ్యం మీడియాకు విడుదల చేశారు.

Updated Date - Sep 29 , 2025 | 03:59 AM