National Flag Crafted with Ankudu Wood: అంకుడుకర్రతో జాతీయ పతాకం
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:02 AM
అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామానికి చెందిన యువ హస్త కళాకారుడు గుత్తి వాసు స్వాతంత్య్ర దినోత్సవాన్ని,,
రాఫెల్ యుద్ధ విమానం కూడా.. ఏటికొప్పాక కళాకారుడి నైపుణ్యం
ఎలమంచిలి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామానికి చెందిన యువ హస్త కళాకారుడు గుత్తి వాసు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంకుడు కర్ర, సహజ సిద్ధమైన రంగుల మేళవింపుతో రూపొందించిన కళారూపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బీఈడీ చేసిన వాసు గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేస్తూ, మరోపక్క హస్తకళావృత్తిని కొనసాగిస్తున్నారు. ఆరు రోజులపాటు శ్రమించి అంకుడు కర్రతో 38 సెంటీమీటర్ల పొడవు, 23 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన జాతీయ పతాకాన్ని, శాంతికి చిహ్నమైన రెండు పావురాలను తయారుచేశారు. పక్షం రోజుల క్రితం రెండు రాఫెల్ యుద్ద విమానాలను, అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రూపొందించారు. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల సహకారంతో ప్రధాని నరేంద్రమోదీకి అందజేయాలనుకుంటున్నట్టు వాసు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
