Share News

18నుంచి జాతీయ వినియోగదారుల వారోత్సవాలు

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:43 PM

జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వరకు నిర్వహించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ తెలిపారు.

18నుంచి జాతీయ వినియోగదారుల వారోత్సవాలు
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌

నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వరకు నిర్వహించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ తెలిపారు. సోమవారం ఆయన సివిల్‌ సప్లయిస్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, హెల్త్‌, రవాణా, లీగల్‌ మెట్రాలజీ, ఫుడ్‌ సేఫ్టీ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా జేసీ మాట్లాడుతూ.. వారోత్సవాలను పురస్కరించుకొని జి ల్లాలోని ఉన్నతపాఠశాలలో, జూనియర్‌ కళాశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. 2025వ సంవత్సవరానికి డిజిటల్‌ న్యాయ పరిపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం అనే ఇతి వృత్తంతో వేడుకలను పౌర సరఫరాల శాఖ నిర్వహించాలని ఆదేశించారు. ఈ వేడుకల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో సమాచారం- విద్యా- కమ్యూనికేషన- ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాలకు సం బంధించిన ఫొటోలను విద్య లీఫ్‌, జ్ఞానన భూమి ఇంటర్‌ మీడియట్‌ యాప్‌ల్లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.

Updated Date - Dec 15 , 2025 | 11:43 PM