E-Governance: 22, 23న ఈ-గవర్నెన్స్ పై జాతీయ సదస్సు
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:53 AM
ఈ-గవర్నెన్స్‌కు ప్రాధా న్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ విధానంపై ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సులో...
విశాఖపట్నం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘ఈ-గవర్నెన్స్’కు ప్రాధా న్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ విధానంపై ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సులో ‘ఈ-గవర్నెన్స్’ విధి విధానాలు, ప్రక్రియ, సిబ్బంది నియామకం, సంక్షేమం, శిక్షణ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆధునిక పాలనా విధానాలపై చర్చింనున్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో జరగనున్న ఈ సదస్సుకు కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ నేతృత్వం వహిస్తుండగా, ఆతిథ్యం బాధ్యతలను రాష్ట్ర సర్కారు తీసుకుంది. ‘వికసిత్ భారత్, సివిల్ సర్వీసెస్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్’ ఇతివృత్తంగా జరగనున్న ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి 1,000 మంది అతిథులు, ఐటీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్, కేంద్ర ఐటీ మంత్రి సహా, పలు రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు పాల్గొననున్నారు.