Digital Services Awards: డిజిటల్ సేవలకు జాతీయ అవార్డులు
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:20 AM
ప్రభుత్వ శాఖల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ డిజిటల్ సేవలందిస్తున్న కార్యాలయాలకు జాతీయ స్థాయి అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వశాఖలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ డిజిటల్ సేవలందిస్తున్న కార్యాలయాలకు జాతీయ స్థాయి అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అన్ని రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆయా శాఖలు అందిస్తున్న డిజిటల్ సేవలను వివరిస్తూ ఈనెల 15వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు సోమవారం ఐటీశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యుత్తమ డిజిటల్ సేవలందించే సంస్థలకు గోల్డ్, సిల్వర్ అవార్డులు అందిస్తారు. గోల్డ్ విన్నర్‌కు రూ. 10 లక్షలు, సిల్వర్ విన్నర్‌కు రూ. 5 లక్షల చొప్పున బహుమతిగా ఇస్తారు. 2023 అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అందించిన డిజిటల్ సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేస్తారు.