Union Minister Srinivas Varma: నరసాపురం-చెన్నై వందేభారత్ ప్రారంభం
ABN , Publish Date - Dec 16 , 2025 | 02:54 AM
దేశంలో బ్రాంచ్ లైన్‌లో నడిచే తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నరసాపురం-చెన్నై మధ్యడిచే రైలేనని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు....
పచ్చజెండా ఊపిన కేంద్రమంత్రి వర్మ
నరసాపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): దేశంలో బ్రాంచ్ లైన్‌లో నడిచే తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నరసాపురం-చెన్నై మధ్య నడిచే రైలేనని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపుర ంలో వందేభారత్ రైలును సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి వర్మ మాట్లాడారు. వందేభారత్‌ను జిల్లా వరకు తీసుకొచ్చేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింద న్నారు. అందరినీ ఒప్పించి మొదటి వందేభారత్‌ను తీసుకురాగలిగామన్నారు. రానున్న రోజుల్లో బెంగళూరు, హైదరాబాద్‌కు కూడా నరసాపురం నుంచి వందేభారత్ నడిపేలా కృషి చేస్తామని చెప్పారు. రైలు ప్రారంభాన్ని పురస్కరించుకుని నరసాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రారంభోత్సవంలో మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, పులపర్తి అంజిబాబు, గుడివాడ ఎమ్మె ల్యే రాము, కలెక్టర్ నాగరాణి, రైల్వే డీఅర్‌ఎం మోహిత్ సోనాకియా తదితరులు పాల్గొన్నారు. వారంతా ఇదే రైలు లో భీమవరం వరకు ప్రయాణించారు. కాగా.. వందేభారత్ రైలు వెళ్తుండగా కైకలూరులో పశువులు ట్రాక్‌పైకి వ చ్చాయి. మూడు పశువులు రైలుకు అడ్డుగా రావడంతో డ్రైవర్ గమనించి వెంటనే అప్రమత్తమై నిలిపివేశారు. సు మారు ఒక నిమిషం అనంతరం రైలు మళ్లీ బయల్దేరింది.