Share News

Nara Bhuvaneshwari: ప్రజాసేవకు దక్కిన గౌరవం

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:14 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు స్వీకరించారు. లండన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో...

Nara Bhuvaneshwari: ప్రజాసేవకు దక్కిన గౌరవం

  • విశిష్ఠ ఫెలోషిప్‌ అవార్డు స్వీకరించిన భువనేశ్వరి

  • హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ హోదాలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు కూడా..

అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు స్వీకరించారు. లండన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(ఐవోడీ) సంస్థ నుంచి ఈ అవార్డులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 అవార్డును భువనేశ్వరి స్వీకరించారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్ఠ సేవలు అందించినందుకుగాను ప్రతిష్ఠాత్మక ఐవోడీ ఈ అవార్డు అందజేసింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును ప్రకటించగా.. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ హోదాలో ఈ అవార్డును కూడా ఆమె స్వీకరించారు. జాతీయస్థాయిలో ఎఫ్‌ఎంసీజీ విభాగంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ను ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు.

Updated Date - Nov 05 , 2025 | 05:14 AM