Share News

Advocate Garudadri Sudarshan: నేను.. నా స్టీల్‌ ప్లేట్‌

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:54 AM

ప్లాస్టిక్‌, మైక్రో ప్లాస్టిక్‌ వంటివి మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతుంటారు. ప్లాస్టిక్‌ ఏదో రూపంలో శరీరంలోకి ప్రవేశించి ప్రమాదకర జబ్బులను తెచ్చుకొనే పరిస్థితులను కూడా చూస్తూనే ఉన్నాం.

 Advocate Garudadri Sudarshan: నేను.. నా స్టీల్‌ ప్లేట్‌

  • నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ఓ న్యాయవాది వినూత్న ఆలోచన

  • ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద ఉద్యమం

  • ఏ ఫంక్షన్‌కు వెళ్లినా వెంటే స్టీల్‌ ప్లేట్‌,గ్లాస్‌

ఆత్మకూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌, మైక్రో ప్లాస్టిక్‌ వంటివి మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతుంటారు. ప్లాస్టిక్‌ ఏదో రూపంలో శరీరంలోకి ప్రవేశించి ప్రమాదకర జబ్బులను తెచ్చుకొనే పరిస్థితులను కూడా చూస్తూనే ఉన్నాం. నేడు ఏ ఫంక్షన్‌కు వెళ్లినా.. అక్కడ విందు భోజనం సమయంలో ప్లాస్టిక్‌ కవర్‌ పరిచి ఉండే పేపర్‌ ప్లేట్లనే ఎక్కువగా పెడుతుంటారు. అయితే ఈ విధానాన్ని నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన గరుడాద్రి సుదర్శన్‌ అనే న్యాయవాది తిరస్కరించారు. ప్లాస్టిక్‌ చట్రంలో పడిపోయిన జీవన విధానంలో మార్పు అవసరమనే నినాదంతో ఏ కార్యక్రమానికి వెళ్లినా.. అక్కడ భోజనం చేసేందుకు తన వెంట ఒక స్టీల్‌ ప్లేట్‌, గ్లాస్‌ తీసుకెళ్తున్నారు. ఆ ప్లేట్‌లోనే ఆహార పదార్థాలను పెట్టించుకుంటారు. ఎక్కడైనా టీ షాపునకు వెళ్లినా అక్కడ ప్లాస్టిక్‌ గ్లాస్‌ ఉంటే దానికి బదులు తన వెంట తెచ్చుకున్న స్టీల్‌ టీ గ్లాస్‌ను వాడుతుంటారు. ఇది చూడ్డానికి కొంత మందికి కాస్త విడ్డూరంగా అనిపించినా.. ప్లాస్టిక్‌ కారకాల వల్ల కలిగే ప్రమాదాన్ని ఆయన తన జీవన విధానంతో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యతిరేక నిశ్శబ్ద ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated Date - Aug 18 , 2025 | 04:55 AM