Minister Kandula Durgesh: నవంబరులో నంది నాటకోత్సవాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:35 AM
వ్యవహారిక భాషకు గొడుగుపట్టిన మహనీయుడు గిడుగు రామమూర్తి అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
భాషకు గొడుగు..గిడుగు: మంత్రి కందుల దుర్గేశ్
14 మందికి గిడుగు పురస్కారాల ప్రదానం
సిరిపురం (విశాఖపట్నం), ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): వ్యవహారిక భాషకు గొడుగుపట్టిన మహనీయుడు గిడుగు రామమూర్తి అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. గిడుగు రామమూర్తి 162వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, భాష గొప్పతనాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలబెడుతున్నారన్నారు. అనంతరం గిడుగు పురస్కారాలను 14 మందికి అందించారు. రేగుళ్ల మల్లికార్జున రాసిన ‘తెలుగు వెలుగు’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.