నల్లమల సోయగం.. మధురమైన ప్రయాణం..!
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:21 PM
నల్లమల సోయగాలు(అందాలు) వర్ణణాతీతం.
నల్లమల సోయగాలు(అందాలు) వర్ణణాతీతం. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం ఓ మధురమైన అనుభూతి. నల్లమలను కప్పేసిన పొగమంచు, ఎత్తయిన కొండలు, కొండల మీద పచ్చని వృక్షాలు ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం బ్రిటీషు వారు నిర్మించిన రైల్వే వంతెన దిమ్మెలు పెంటగాన టవర్లలో నేటికీ పదిలంగా దర్శనమిస్తున్నాయి. రుద్రవరం ఫారెస్టు సబ్ డివిజనలోని చెలిమ రేంజ్‌లోని నంద్యాల - ఒంగోలు రహదారిలో సుమారు 18 కిమీ అటవీ ప్రయాణం ప్రయాణికు లను ఆకట్టుకుంది. ఒంపుసొంపుల రహదారి, పరిఢవిల్లుతున్న పచ్చదనం మధ్య జర్నీ చేస్తే మైమరిచిపోవాల్సిందే. ఎత్తయిన కొండల మధ్య పచ్చని వృక్షాలతో రైల్వే పట్టాలు ఉన్నాయి. అటు రైల్వే, ఇటు రోడ్డు ప్రయాణికులకు నల్లమల శోభ ఆహ్లాదానిస్తోంది. జలపాతాలు, అరుదైన పక్షులు, వన్యప్రాణులు దర్శనంతో ప్రయాణం సాగుతోంది. టూరిస్టులను పచ్చదనం ఆకట్టుకుంటుంది. ఈ ముగ్ధ మనోహర దృశ్యాలను శుక్రవారం ‘ఆంధ్య్రజ్యోతి’ తన కెమెరాలో బంధించింది.
ఫ రుద్రవరం, ఆంధ్రజ్యోతి