Share News

డ్రగ్స్‌ కేసులున్న వారితో వైసీపీ విద్యార్థి విభాగం: నాదెండ్ల బ్రహ్మం

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:45 AM

గడచిన ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుకున్నా వాటి మూలాలు ఏపీలోనే ఉండేవి.

డ్రగ్స్‌ కేసులున్న వారితో వైసీపీ విద్యార్థి విభాగం: నాదెండ్ల బ్రహ్మం

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘గడచిన ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుకున్నా వాటి మూలాలు ఏపీలోనే ఉండేవి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు డ్రగ్స్‌, గంజాయి వ్యాపారం చేశారు’ అని కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ విద్యార్థి నాయకుడు పి.కొండారెడ్డి డ్రగ్స్‌ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. 48 గంటలు గడిచినా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. దీన్ని బట్టి జగన్‌ డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. గంజాయి, డ్రగ్స్‌ కేసుల్లో ఉన్న వారితో వైసీపీ తన విద్యార్థి విభాగాలను నడుపుతోంది. వైసీపీ పాలనలో గంజాయి విక్రయాల్లో ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది’ అని బ్రహ్మం ఆరోపించారు.

Updated Date - Nov 08 , 2025 | 06:45 AM