Share News

పకడ్బందీగా అమలు చేయాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:54 PM

పదవ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి ఆదేశించారు.

పకడ్బందీగా అమలు చేయాలి
మాట్లాడుతున్న డీఈవో జనార్దనరెడ్డి

మహానంది, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి ఆదేశించారు. శనివారం గాజులపల్లి జడ్పీ పాఠశాలను డీఈవో పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడారు. ప్రభుత్వం నేటి నుంచి పది విద్యార్థులకు అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళిక ప్రకారం ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఆదివారం కూడా క్లాసులు తీసుకోవాలని తెలిపారు. పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో రామసుబ్బయ్య, ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 11:54 PM