పకడ్బందీగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:06 AM
స్వమిత్వాకు సంబంధించి వెక్టరైజేషన ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీసీలో కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : స్వమిత్వాకు సంబంధించి వెక్టరైజేషన ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎనఐసీ వీడియో హాల్ నుం చి స్వామిత్వ, పంచాయతీ రాజ్ కార్యకలాపాలు, గ్రామ సచివాలయ సర్వీసులపై జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి ఎంపీడీవోలు, మున్సిప ల్ కమిషనర్లు, ఈవోఆర్డీలతో వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్ష నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ..గ్రామ సచివాలయ సర్వీసులకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు దృష్టి సారించాల న్నారు. వాట్సాప్ గవర్నెన్స ఇంటింటి క్యాంపెయిన ఇంకా 3.55 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని, శుక్రవారం నాటికీ పూర్తి చేయాలన్నారు. కౌశలంకు సంబంధించి 2957 పెండింగ్‌లో ఉన్నాయని అందులో ఎక్కువ శాతం ఆళ్లగడ్డ, కొత్తపల్లి, మహానంది మండలాల్లో ఉన్నా యని వాటిని బుధవారం నాటికీ పూర్తి చేయాలని ఆదేశించారు. వాహన డేటాకు సంబంధించి ఆధార్ లింకేజ్ పూర్తి చేయాలని, చిల్డ్రన వితౌట్ ఆధార్‌కు సంబంధించి మహిళా కార్యదర్శులు, ఐసీడీఎస్ సిబ్బంది ద్వారా పూర్తి చేయించాలన్నారు. మ్యాన్డేటరీ బయోమెట్రిక్‌కు సంబంధించి వెల్ఫేర్, ఎడ్యుకేషన అసిస్టెంట్ లాగిన లో పెండింగ్‌లో ఉన్నవి అప్‌డేట్ చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు శాతం మెరుగ్గా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. వెక్టరైజేషన పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి 9(2) నోటీసులు అందజేయాలన్నారు.