వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:24 AM
పది, ఇంటర్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణ సాధించేలా కృషి చేయాలని కేజీబీవీ రాష్ట్ర డైరెక్టర్ డి.దేవానందరెడ్డి అధికారులను ఆదేశించారు.
కేజీబీవీ డైరెక్టర్ దేవానంద రెడ్డి
కర్నూలు ఎడ్యుకేషన, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పది, ఇంటర్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణ సాధించేలా కృషి చేయాలని కేజీబీవీ రాష్ట్ర డైరెక్టర్ డి.దేవానందరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వర్చువల్ స్టూడియో భవనంలో కేజీబీవీ ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దేవానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు విద్యాప్రమాణాలను పెంపొందించేందుకు విజయపథం కార్యక్రమాన్ని జూలై 15 నుంచి ప్రారంభించామని, దానిని సమర్ధవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపాళ్లపై ఉందన్నారు. గతంలో పరీక్షల ముందు మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించేవారనీ, ఈసారి ప్రారంభం నుంచే రోజువారి పరీక్షలు స్టడీ అవర్స్ వంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించాలన్నారు. విద్యార్థులకు తరుచూ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. భోజనం తయారు చేసేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.