Share News

ప్రజల సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి

ABN , Publish Date - May 16 , 2025 | 11:59 PM

ఇక నుంచి జమ్మలమడుగు నగర పంచాయతీ కాదని, మున్సిపాలిటీయేనని గ్రేడ్‌-3గా మారిన ప్రజలపై పన్నుల భారం పడదని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అన్నారు.

 ప్రజల సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి
కమిషనర్‌ను అభినందిస్తున్న మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి

జమ్మలమడుగు, మే 16 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి జమ్మలమడుగు నగర పంచాయతీ కాదని, మున్సిపాలిటీయేనని గ్రేడ్‌-3గా మారిన ప్రజలపై పన్నుల భారం పడదని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయం వద్ద కమిషనర్‌ వెంకటరామిరెడ్డికి పుష్పగుచ్ఛం అందించి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి అనేకమార్లు మున్సిపల్‌ శాఖ మంత్రిని కలిసి జమ్మలమడుగు అభివృద్ధిపై విన్నవించడం జరిగిందన్నారు. ఆ దిశగా జమ్మలమడుగు గ్రేడ్‌-3గా ఏర్పాటు చేశారన్నారు. భవిష్యత్తులో జమ్మలమడుగు మున్సిపాలిటీ గ్రేడ్‌-2లో వస్తుందని, దాంతో మరింత అభివృద్ధి, సేవలు పెరుగుతాయన్నారు. శ్రీనివాసులరెడ్డి, తోళ్లమడుగు ఖాదర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:59 PM