3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె: ఏఐటీయూసీ
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:02 AM
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చే నెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్...
గుంటూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చే నెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట మాల్యాద్రి తెలిపారు. ఈ మేరకు సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకు సమ్మె నోటీసు అందజేశారు. రెండేళ్లుగా విధుల్లో ఉండి మరణించిన, పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను అవుట్ సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకోవాలని తదితర డిమాండ్లతో నోటీసు అందజేశారు.